టీటీడీ పి ఆర్ ఓ గారికి

టీటీడీ పి ఆర్ ఓ గారికి 

తిరుపతి. 

విషయం : హిందూ టెంపుల్స్ గైడ్ ట్రస్ట్ సభ్యులకు శ్రీవారి సేవ భాగ్యం కల్పించడం కొరకు విన్నపం 

  గౌరవనీయులైన టీటీడీ పి ఆర్ ఓ శ్రీ రవి గారికి నమస్కారాలు , నా పేరు అక్కిరెడ్డి రాజాచంద్ర , కాకినాడ జిల్లా పిఠాపురం మండలం విరవ మా స్వగ్రామం. నేను M.A పూర్తిచేశాను, చెన్నై లో ఉద్యోగం చేసే సమయం లో  రామేశ్వరం యాత్రకు వెళ్ళినప్పుడు అక్కడ మన తెలుగు వారు భాష రాక మరియు  ఏమేమి చూడాలో తెలియక ఇబ్బంది పడటం గమనించి 2011 నుంచి సోషల్ మీడియా ద్వారా ఆలయాల సమాచారం షేర్ చేయడం మొదలు పెట్టాను ఆ తర్వాత  హిందూ టెంపుల్స్ గైడ్ అనే వెబ్సైట్ మరియు యూట్యూబ్ ఛానల్ ఫేస్బుక్ ద్వారా ఆలయాల సమాచారం ఎక్కువ మందికి చేరడానికి నా వంతుగా ప్రయత్నం చేస్తున్నాను . యూట్యూబ్ ఛానల్ లో 6 లక్షల 45 వేల మంది , ఫేస్ బుక్ లో  7 లక్షల మంది ఫాలోయర్స్ కలరు .  2017 లో హిందూ టెంపుల్స్ గైడ్  ట్రస్ట్ గా రిజిస్టర్ చేయడం జరిగింది . 

హిందూ టెంపుల్స్ గైడ్ అనేది లాభాపేక్ష లేకుండా నిస్వార్ధంగా సేవ దృక్పదంతో పనిచేస్తున్న సంస్థ. సభ్యుల కోరిక మేరకు హిందూ టెంపుల్స్ గైడ్ సభ్యులకు శ్రీవారి సేవ చేసే అవకాశం కల్పించాలనే సదుద్దేశ్యంతో ఇది కూడా ఒక సేవ గా భావించి ప్రతిఫలాపేక్ష లేకుండా  టీటీడీ వారి అనుమతి కి దరఖాస్తు చేస్తున్నాము . శ్రీవారి సేవ చేయడానికి ఆంధ్ర , తెలంగాణ , కర్ణాటక , ఒడిశా, తమిళనాడు రాష్టాలలో ఉన్న టెంపుల్స్ గైడ్ సభ్యుల లో అర్హత కలిగిన (18-60 సంవత్సరాలు ) 1200 మంది సభ్యులు వారి వివరాలను మాకు పంపించడం జరిగింది. 
    
మా సభ్యులకు ఒక అవకాశం ఇప్పించగలరని విన్నవించుకున్నాము  . టీటీడీ నిర్ణయాలకు నియమ నిబంధనలకు  లోబడే మా సభ్యులు నడుచుకుంటారు. తమరు దయతో శ్రీ వేంకటేశ్వరుని సేవ చేసే భాగ్యాన్ని మాకు కల్పించగలరని కోరుకుంటున్నాము . 

Comments