పిఠాపురం కుక్కుటేశ్వర స్వామి ఆలయ సమయాలు, చరిత్ర - Pithapuram Kukkuteswara Swamy Temple Timings, History

పాదగయ క్షేత్రం:

కుక్కుటేశ్వరుడి గుడికి ఎదురుగా ఒక తటాకం ఉంది. దానిని "పాదగయ" అంటారు. ఈ పాదగయకి ఆ పేరు ఎలా వచ్చిందో వివరిస్తూ రెండు కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. గంగా తీరమున ఉన్న గయ "గయా శీర్షం" అనీ, పిఠాపురంలో ఉన్నది "పాదగయ" అనీ ఒక సిద్ధాంతం. అందుకనే పాదగయలో స్నానం చేస్తే గంగలో చేసినంత ఫలితం అని ఒక నమ్మకం ఉంది. గయుడు అనే రాక్షసుడి పాదాలు అక్కడ ఉన్నాయి కనుక ఇది పాదగయ అయిందని మరొక వదంతి. గయునికి సంబంధించిన ఒక కథనం ప్రకారం గయుని చావు తరువాత చచ్చిన శవం యొక్క బుర్ర సింహాచలం దగ్గర, పాదాలు పిఠాపురం దగ్గర పడ్డాయిట. అందుకని సింహాచలం నుండి పిఠాపురం వరకు ఉన్న ప్రదేశం పాపభూమి అనేవారు. పాపభూమి కాబట్టే ఈ మధ్య ప్రదేశంలో పుణ్య క్షేత్రాలు లేవుట. అన్నవరం తదనంతర కాలంలో ప్రశస్తి చెందినది. అందువలననే శ్రీనాథుని రచనలలో ఎక్కడా అన్నవరం చరిత్ర కనబడదు.

పౌరాణిక ప్రశస్తి

గయాసురుడు కావడానికి రాక్షసుడే అయినా మహా భక్తుడు. ఆయన రాక్షసులకు రాజు. వేలాది సంవత్సరాలు మహావిష్ణువును ప్రసన్నం చేసుకునేందుకు చాలా గొప్ప తపస్సు చేశారు. తను చేసిన అద్భుతమైన తపస్సుకు ప్రసన్నుడై మహావిష్ణువు వరం కోరుకొమ్మనగా నా శరీరం అన్ని పరమ పావనమైన తీర్థాలకన్నా పవిత్రమై ఉండేలాగా వరం కావాలని కోరుకున్నారు. విష్ణువు ఆ కోరికను మన్నించగా గయాసురుని శరీరం పరమ పవిత్రమైపోయింది. బ్రహ్మహత్య, సురాపాన, స్వర్ణస్తేయ, గురుతల్ప మొదలైన పంచమహాపాపాలు సహితంగా అన్ని రకాల పాపాలు ఆయన శరీరాన్ని తాకగానే నశించిపోయేవి. ఆయనను తాకివెళ్ళిన ప్రతివారూ నేరుగా మోక్షాన్ని పొందేవారు, అంతేకాక కీటకాలు, సూక్ష్మజీవులు కూడా గాలికి కొట్టుకువస్తూ ఆయన శరీరాన్ని తాకిపోతూండగానే మోక్షాన్ని పొందేవి.

ఇది కాక ఆయన చేసిన గొప్ప యాగాలు, పుణ్యకార్యాల వల్ల నేరుగా ఇంద్రపదవి లభించింది, అప్పటివరకూ స్వర్గాధిపతిగా ఉన్న ఇంద్రుడు పదవీభ్రష్టుడయ్యారు. పదవిని కోల్పోయిన ఇంద్రుడు కూడా ఘోరమైన తపస్సు చేసి బ్రహ్మదేవుడిని ప్రసన్నం చేసుకున్నారు. బ్రహ్మ ఓ గొప్ప యాగాన్ని తలపెట్టానని, దానికి తగ్గ పరమ పవిత్రమైన స్థలాన్ని చూపించమని గయాసురుణ్ణి కోరారు. గయాసురుడు చాలా భారీకాయుడు. 576 మైళ్ళ పొడవు, 268 మైళ్ళ నడుము చుట్టుకొలత కలిగిన అతికాయుడు కాబట్టి పవిత్రమూ, విశాలమూ అయిన తన తలపై యజ్ఞం చేసుకొమ్మని అనుమతించారు.

బ్రహ్మ యాగం వేడికి గయుని తల కదలడం ప్రారంభించింది. దాన్ని కదలకుండా చేసేందుకు బ్రహ్మ చాలా పెద్దపెద్ద శిలలను గయాసురిని తలపై పెట్టసాగారు. ఆ శిలలేవీ కూడా గయాసురుని తల కదలకుండా ఆపలేకపోగా అవన్నీ చుట్టూ పడి రామపర్వతం, ప్రేతపర్వతం వంటివి ఏర్పడ్డాయి. దానితో బ్రహ్మ చివరకు మరీచి శాపం వల్ల శిలగా మారిన మహాపతివ్రత దేవవ్రత శిలను తీసుకువచ్చి తలపై పెట్టారు. శిలారూపంలోనున్న మహాపతివ్రతను తోసివేయలేక కదలికలు కట్టడి చేసుకున్నా మొత్తానికి మానుకోలేకపోయాడు. అప్పుడు బ్రహ్మదేవుడు విష్ణుమూర్తిని ప్రార్థించగా ఆయన గదాధారుడై వచ్చి తన కుడికాలు గయాసురుని తలపై పెట్టి తొక్కిపట్టారు.

గయాసురుడు ఆ సమయంలో విష్ణుమూర్తిని ప్రార్థించి నా శరీరం పరమ పవిత్రమైన తీర్థక్షేత్రంగా వరం పొందింది. నా తలపై బ్రహ్మదేవుడే యాగం చేశాడు. పతివ్రతయైన దేవవ్రత శిలారూపంలో నిలిచింది. సాక్షాత్తూ మహావిష్ణువువైన నీవే కుడిపాదాన్ని పెట్టావు. ఇన్ని పొందిన నా శిరోమధ్యపాద భాగాలు పితృదేవతలను సైతం తరింపజేసే ప్రభావశాలి, పరమ పవిత్రమూ అయిన దివ్యక్షేత్రములయ్యేట్టుగా, అవి తన పేరున వ్యవహరింపబడేట్టుగా వరం కావాలని కోరి పొందారు.

ఈ కథలోనే కొన్ని వేర్వేరు చిరు భేదాలు ఉన్నాయి. మరో కథనం ప్రకారం గయుడు ఇంద్రుడు కావడం కాక గయుని మహా ప్రభావం వల్ల ఆయనను చూసినవారు, తాకినవారు నేరుగా బ్రహ్మమును పొందుతూండగా వేదకర్మలు నశిస్తూన్న స్థితి ఏర్పడింది. దానితో లోకంలో వేదకర్మలు నశించగా, ఇంద్రాదుల కోరికపైన (కొన్ని కథనాల్లో స్వయంగానూ) బ్రహ్మదేవుడు ఒక యజ్ఞాన్ని సంకల్పించి, గయుని తలపై చేస్తారు. రాత్రి మొత్తం ఉండే ఈ యాగం తెల్లవారినాకా పూర్తవుతుంది. ఐతే శివుడు కుక్కుటరూపంలో (కోడిపుంజుగా) వచ్చి కూయడంతో నిజంగా తెల్లవారిందేమోనని భ్రమించిన గయాసురుడి హఠాత్ కదలికల వల్ల యాగం అర్ధాంతరంగా ఆగిపోతుంది. నిర్ణయించిన దాని ప్రకారం శిక్షగా ఆయన తలను పాతాళానికి తొక్కుతారు అనేది ఆ ప్రత్యామ్నాయ కథనం చెప్పే విషయం.

ఈ కుక్కుటేశ్వరుడి ఆలయ ప్రాంగణం లోనే కాలభైరవుడి విగ్రహం "వ్రీడావిహీనజఘనమై" చూసేవారికి సిగ్గును కలిగించేదిగా ఉంది.

పురుహూతికా దేవి ఆలయం:

కుక్కుటేశ్వరస్వామి ఆలయ సముదాయంలో పురుహూతికా దేవి ఆలయం ఉంది. ఇది అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటి. భారతదేశం లోని అష్టాదశ మహా శక్తి పీఠములలో ఒకటైన హుంకారిణీ శక్తి పీఠం ఈ కుక్కుటేశ్వరుడి దేవళంలో ఉండేది. పుస్తకాలలో, పురాణాలలో కల ఈ పీఠం కాని, ఆ శక్తి విగ్రహం కాని ప్రస్తుతం కానరావు. ఈ పీఠం మూలంగానే పిఠాపురానికి పీఠికాపురం అనే పేరు వచ్చిందని అంటారు. ఈ హుంకారిణీ శక్తి విగ్రహం రైలు స్టేషనుకి ఎదురుగా ఉన్న మట్టి దిబ్బలో భూస్థాపితమై ఉన్నదని లోక ఐతిహ్యం ఉంది. పురావస్తు పరిశోధక శాఖ వారు తవ్వకాలు జరిపించి చూస్తే కనిపించవచ్చని ప్రజలు అనుకొంటారు.

శ్రీపాద వల్లభ అనఘ దత్తక్షేత్రం:

పిఠాపురం దత్త క్షేత్రములలో ఒక ప్రాముఖ్య క్షేత్రం, శ్రీ గురు దత్తాత్రేయ స్వామి ప్రథమ అవతారం అయిన "శ్రీ పాద శ్రీ వల్లభ" స్వామి ఈ క్షేత్రంలో జన్మించారు, ఆయన జన్మించిన గృహం ఇప్పడు "శ్రీ పాద శ్రీ వల్లభ మహా సంస్థానం"గా ఏర్పాటు చేయబడింది, శ్రీ కుక్కుటేశ్వర దేవాలయంలో శ్రీ దత్తాత్రేయ స్వామిల వారు స్వయంభూ విగ్రహరూపంలో దర్శనం ఇస్తారు, భారతదేశంలో దత్తాత్రేయుని స్వయంభూ విగ్రహం కేవలం పిఠాపురంలో మాత్రమే కలదు, మిగతా దత్త క్షేత్రములలో స్వామివారి పాదుకలు ఉన్నాయి.


శ్రీ కుక్కుటేశ్వర స్వామి నిత్య పూజలు:

ఉదయం 5.30 నుండి 11.00 వరకు అభిషేకం

మధ్యాహ్నం 12.30 గంటలకు మహా నివేదన

సాయంత్రం 4.30 గంటలకు దర్శనం

సాయంత్రం 6.00 గంటలకు ధూపసేవ

రాత్రి 7.30 గంటలకు నివేదన, నీరాజనం, మంత్ర పుష్పం, దర్బారుసేవ, పవళింపు సేవ.


పూజా ఖర్చు:

1 అంతరాలయ దర్శనం (సాధారణ రోజులు) రూ 20/-

2 మహాన్యాస పూర్వకాభిషేకం రూ. 50/-

3 సహస్ర నామార్చన రూ 30/-

4 ఏకాదశ రుద్రాభిషేకం రూ 150/-

5 తైలాభిషేకం రూ. 50/-

6 పిండ ప్రదానం రూ 75/-

7 లక్షల బిల్వార్చన రూ 250/-

8 లక్షల కుంకుమార్చన రూ 250/-

9 హోమం రూ 150/-

10 పారాయణం/ జపం రూ 60/-

11 కేశకందన రూ 10/-

12 నామకరణం రూ 20/-

13 మాలధారణ/ ఇరుముడి రూ 20/-

14 నవగ్రహ శాంతి రూ 20/-

15 ముసివాయనం రూ 20/-

16 ప్రత్యేక దర్శనం (సాధారణ రోజులు) రూ 20/-

17 విశిష్ట దర్శనం (ప్రత్యేక రోజులు) రూ 40/


శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి నిత్య పూజలు:

ఉదయం 6.00 గంటలకు సహస్ర కుంకుమార్చన

మధ్యాహ్నం 12.30 గంటలకు మహా నివేదన


శ్రీ పురుహూతికమ్మవారి నిత్య పూజలు:

ఉదయం 6.30 గంటలకు సహస్ర కుంకుమార్చన

మధ్యాహ్నం 12.30 గంటలకు మహా నివేదన


శ్రీ దత్తాత్రేయ స్వామివారి నిత్య పూజలు:

ఉదయం 5.30 నుండి 11.00 వరకు అభిషేకం

మధ్యాహ్నం 12.30 గంటలకు మహా నివేదన

సాయంత్రం 4.30 నుంచి రాత్రి 8.00 వరకు దర్శనం

సాయంత్రం 6.00 గంటలకు ఆస్తోత్రం


శ్రీ గురు మందిరం నిత్య పూజలు:

ఉదయం 6.00 గంటలకు కాకర హారతి

మధ్యాహ్నం 12.00 గంటలకు మధ్యన హారతి

మధ్యాహ్నం 12.30 గంటలకు మహా నివేదన

సాయంత్రం 6.00 గంటలకు సంధ్యా హారతి

రాత్రి 9.00 గంటలకు స్వీజ్ హారతి


వసతి:

ఆలయ అధికారులు భక్తుల కోసం 3 A/C మరియు 4 నాన్-A/c గదులను అందిస్తున్నారు.

4 నాన్-ఎ.సి రూములు రోజుకు రూ. 600/-

3 A.C గదులు రూ. మా ఆలయంలో రోజుకు 999/- లభిస్తాయి.

A.c డార్మెటరీ(32) లాకర్ సదుపాయంతో 100/-రూ.ల ఖర్చుతో అందుబాటులో ఉంది.


రూమ్‌ల బుకింగ్ కోసం దయచేసి దిగువ కాంటాక్ట్ నంబర్‌లకు కాల్ చేయండి.

1. మాధవ - 7386302797

2. అర్జున్ 9705531421

3. సుబ్రమణ్యం 7729922213


వసతి కొరకు సంప్రదించండి:

కుక్కుటేశ్వర స్వామి దేవస్థానం

పిఠాపురం

తూర్పుగోదావరి జిల్లా

పిన్ కోడ్: 533450

ఫోన్ నంబర్: 08869 - 252477

సమయాలు: 7:30am - 12:30pm & 4:30pm - 8:30pm


ఇతర ఆలయాలు:

1. కుంతి మాధవస్వామి ఆలయం (పంచ మాధవ క్షేత్రాలలో ఒకటి)

2. నూకాలమ్మ గుడి

3. రాముని కోవెల (మంగాయమ్మరావు పేట)

4. వెంకటేశ్వరస్వామి

5. సాయిబాబా గుడి (చిన్న పోస్టాఫీస్ వద్ద)

6. కోట సత్తెమ్మ తల్లి గుడి (సీతయ్యగారి తోట)

7. శ్రీ విశ్వ విజ్ఞాన ఆధ్యాత్మిక పీఠం (పాత బస్టాండ్ వద* శ్రీ పాద శ్రీ వల్లభ మహా సంస్థానం (వేణుగోపాలస్వామి గుడి వద్ద)

8. దత్తాత్రేయుడి గుడి (దూళ్ళ సంత దగ్గర, అగ్రహారం)

9. పిఠాపురంగురూజీ (త్రిశక్రిగాయత్రిమహాసంస్ధానం)


పిఠాపురం చుట్టూ ప్రక్కల ప్రసిద్ధ దేవాలయాలు :

1. శ్రీ సత్యనారాయణ స్వామి దేవాలయం అన్నవరం

2. పంపా నది అన్నవరం

3. తలుపులమ్మ తల్లి దేవాలయం తుని

4. ఉప్పాడ బీచ్, కాకినాడ దగ్గర

5. పురుహూతికా దేవి / కుక్కుటేశ్వర దేవాలయం - పిఠాపురం, కాకినాడ దగ్గర

6. కుమారరామ సామర్లకోట భీమేశ్వరాలయం

7. భీమేశ్వర స్వామి ఆలయం, ద్రాక్షారామం

8. శ్రీ భావనారాయణ స్వామి దేవాలయం, సర్పవరం

9. శ్రీపాదశ్రీవల్లభ మహాసంస్తానం పిఠాపురం


పిఠాపురం చేరుకోవటం ఎలా ?

వాయు మార్గం విమానాల్లో వచ్చే యాత్రికులు రాజమండ్రి (60 కి. మీ) లేదా వైజాగ్ (180 కి. మీ) ఎయిర్ పోర్ట్ లో దిగి, క్యాబ్ లేదా టాక్సీ లలో ఎక్కి పిఠాపురం చేరుకోవచ్చు.


రైలు మార్గం 

సామర్లకోట రైల్వే జంక్షన్ పిఠాపురం నుండి కేవలం 10 కిలోమీటర్ల దూరంలో కలదు. ఇక్కడ తెలంగాణ, రాయలసీమ మరియు ఇతర రాష్ట్రాల నుండి వచ్చే అన్ని ఎక్స్ ప్రెస్ రైళ్లు ఆగుతాయి. స్టేషన్ బయట షేర్ ఆటోలు లేదా బస్టాండ్ కు వెళ్లి ప్రభుత్వ బస్సుల్లో ఎక్కి పిఠాపురం చేరుకోవచ్చు.


రోడ్డు మార్గం 

కాకినాడ, సామర్లకోట, రాజమండ్రి, తుని తదితర ప్రాంతాల నుండి ప్రభుత్వ బస్సులు ప్రతిరోజూ తిరుగుతుంటాయి.

కుక్కుటేశ్వర స్వామి, Kukkuteswara Swamy Temple Timings,pithapuram temple timings, pithapuram kukkuteswara swamy temple history in telugu, pithapuram temples list, pithapuram famous temple, pithapuram datta temple, pithapuram famous for, pithapuram datta temple distance, pithapuram temple andhra pradesh

Comments